తిరుపతి న్యాయాలయం రెండో దేవాలయం కావాలి

‘తిరుపతి కోర్టు కాంప్లెక్సును నేను భిన్నమైన కోణంలో చూస్తున్నా. తిరుపతి పుణ్యక్షేత్రానికి దేశ విదేశాల నుంచీ లక్షలాది మంది అనునిత్యం వస్తుంటారు. ఇక్కడి న్యాయాలయం తిరుమల తర్వాత రెండో దేవాలయంగా మారాలి. దానికి తగిన చారిత్రక, మేధోపరమైన వాతావరణం తిరుపతి కోర్టు కాంప్లెక్సులో ప్రతిఫలించాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ ఆకాంక్షించారు. తిరుపతి రూరల్‌ మండలం దామినేడులో రూ.115 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన 16 కోర్టులతో కూడిన ఆరంతస్తుల భవన సముదాయానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుపతి బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తిరుపతి బార్‌ అసోసియేషన్‌కు గొప్ప వారసత్వం, సంప్రదాయాలు ఉన్నాయన్నారు. ఎంతోమంది గొప్ప న్యాయవాదులను అందించిందని గుర్తుచేశారు. ఇప్పటి తరం న్యాయవాదులు కూడా అదే పరంపర కొనసాగించాలని సూచించారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించగానే తాము సురక్షిత ప్రదేశానికి వచ్చామన్న భావన ప్రజల్లో కలగాలన్నారు. అలా ప్రజలకు నిజమైన న్యాయం అందించాలని ఆయన సూచించారు. రాబోయే దశాబ్దాల పాటు అవసరాలకు తగ్గట్టుగా కోర్టు కాంప్లెక్సులో భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు భవన నమూనాలో మెడికల్‌ రూమ్‌ ఏర్పాటు ఉందని, అది కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నే ఏర్పాటు చేయాలని సీజేఐ సూర్యకాంత్‌ సూచించారు