తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు..! 'మీసేవ' రూపకర్త, జాజు కెరీర్ ట్రాక్ రికార్డ్ ఇదే..

తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రధాన కార్యదర్శిగా (CS) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తుండటంతో.. సంజయ్ జాజు వైపే సీఎం రేవంత్ మొగ్గు చూపినట్లు తెలిసింది. కేంద్ర సర్వీసుల నుంచి ఆయన్ను తెలంగాణకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఏపీలో విప్లవాత్మక మీసేవ, సౌకర్యం ఐటీ ప్రాజెక్టులకు ఆధ్యుడైన సంజయ్ జాజు.. కేంద్రంలో రక్షణ ఉత్పాదక, సమాచార ప్రసార శాఖలలో అత్యంత కీలక పాత్ర పోషించి డిజిటల్, రక్షణ రంగాలలో విశేష సేవలందించిన ఘనమైన ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు.