తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో విచిత్రం... చనిపోయిన అభ్యర్థి సర్పంచ్‌గా విజయం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి.రాజకీయాల్లో మనిషి చనిపోయినా కూడా ఆయన చేసిన పనులు బతికే ఉంటాయి అని అందరూ అంటూ ఉంటాం. కానీ పంచాయతీ ఎన్నికల్లో బతికి ఉన్నప్పుడు ప్రజల మనసు గెలుచుకున్న ఓ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఎన్నికల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతలతాన పంచాయతీలో జరిగింది.తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చింతలతాన పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చెర్ల మురళి (50) నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ వేసిన అనంతరం ఆయన మరణించారు. నేడు జరిగిన పోలింగ్‌లో ఓటర్లు ఆయనకు పట్టంకట్టడం విశేషం., News News, Times Now Telugu