దొంగలనుకుని ఫ్యామిలీ కారుపై పోలీసుల కాల్పులు.. ప్రాణాలు కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలిక

పాకిస్థాన్‌లో సెలవులు గడపడానికి వచ్చిన ఒక ఆస్ట్రేలియా కుటుంబంపై స్థానిక పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా సదరు కుటుంబాన్ని దొంగలు అడ్డగించి ఇబ్బంది పెడితే.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. అలా హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు కుటుంబాన్నే దొంగలుగా భావించి కాల్పులకు తెగబడింది. ఈ దారుణ ఘటనలో తండ్రి, కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. తొమ్మిదేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ దారుణ ఘటనపై పారదర్శకమైన దర్యాప్తు జరపాలని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.