న్యూ ఇయర్ వేళ.. మందుబాబులకు భలే మంచి ఆఫర్.. ఫుల్లుగా తాగి ఊగితే ఇంటికి తీసుకెళ్లే బాధ్య ప్రభుత్వానిదే!

నూతన సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో తూగుతూ రోడ్లపై ఇబ్బంది పడేవారికి కర్ణాటక ప్రభుత్వం ఒక ఊహించని శుభవార్త చెప్పింది. పార్టీ మూడ్‌లో ఫుల్‌గా తాగేసి మైకంలో ఉన్నవారిని క్షేమంగా వారి ఇళ్ల వద్ద దింపే బాధ్యతను సాక్షాత్తూ ఖాకీలే తీసుకోనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను అరికట్టడంతో పాటు వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు హోంమంత్రి జి. పరమేశ్వర ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. కేవలం పోలీసులు మాత్రమే కాదు అటు తెలంగాణలోనూ గిగ్ వర్కర్స్ ఉచిత వాహనాలతో సిద్ధంగా ఉన్నారు.