బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు పంపారు.. చివరకు ఏమైందంటే?

నిండు ప్రాణాన్ని కాపాడాల్సిన వైద్యులే యమదూతలుగా మారారు. కనీసం రోగి గుండె చప్పుడును కూడా పరీక్షించకుండా.. పక్క బెడ్‌పై ఉన్న వ్యక్తి చనిపోతే.. బతికున్న రోగికి మరణ ధృవీకరణ పత్రం రాసిచ్చిన ఘోర నిర్లక్ష్యం కాన్పూర్‌లోని ఎల్‌ఎల్‌ఆర్ (LLR) ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. 42 ఏళ్ల వినోద్ అనే వ్యక్తిని చనిపోయాడని వైద్యులు ఫైల్‌పై రాసేయడంతో.. పోలీసులు అతడిని పోస్టుమార్టం కోసం తరలించేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా శవాల గదికి తీసుకెళ్లే నిమిషం ముందు, ఆ శవం ఊపిరి పీల్చుకోవడంతో పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.