నవోదయ ప్రవేశ పరీక్షకు 3,248 మంది హాజరు

జవహర్‌ నవోదయలో 6వ తరగతి ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా నవోదయ ప్రిన్సిపాల్‌ గీత మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామన్నారు. 80 సీట్లకు 4,300 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. పరీక్షకు 3,248 మంది హాజరవగా, 1,052 మంది గైర్హాజరయ్యారన్నారు.