ఒక్క హెచ్-1బీ ఉద్యోగి 10 మంది అక్రమ వలసదారులతో సమానం: అమెరికా పోల్‌స్టర్ సంచలనం

అమెరికాలోని భారతీయ నిపుణులు, హెచ్-బీ వీసా ప్రోగ్రామ్‌పై ప్రముఖ పోల్‌స్టర్ మార్క్ మిచెల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాన అమెరికా కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి భారతీయుల సంఖ్యను తగ్గించుకోవాలని (డీ-ఇండియనైజ్) మిచెల్ సూచించారు. యాపిల్ వంటి అగ్ర సంస్థల నుంచి ఒక సీనియర్ హెచ్-1బీ ఉద్యోగిని తిరిగి పంపడం ఆర్థికంగా పది మంది అక్రమ వలసదారులను పంపడంతో సమానం వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీని విదేశీ శ్రామిక శక్తి ఆక్రమించిందని.. దీని వల్ల 12 మిలియన్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.