అఫ్గాన్‌పై పాకిస్థాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం: భారత్

పాకిస్థాన్ దళాలు అఫ్గానిస్థాన్‌పై జరుపుతున్న వైమానిక దాడులను భారతదేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు చిన్నారులు, మహిళలు, క్రికెటర్లను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కులను స్పష్టంగా ఉల్లంఘించడమేనని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న అఫ్గాన్‌పై యుద్ధచర్యలు సరికావు అని స్పష్టం చేస్తూ.. అఫ్గాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను భారత్ పూర్తిగా సమర్థిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.