పాకిస్థాన్ సంచలన నిర్ణయం: విద్యార్థులకు గీత, మహాభారతం పాఠాలు.. సంస్కృతంలో బోధన

భారత దేశ విభజన తర్వాత తొలిసారిగా.. పాకిస్థాన్‌లో సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందే దిశగా ఒక చారిత్రక అడుగు పడింది. లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (LUMS)లో సంస్కృత భాషను కోర్సుగా తిరిగి ప్రవేశ పెట్టారు. ప్రముఖ సామాజిక శాస్త్ర ప్రొఫెసర్ డా. షాహిద్ రషీద్ చొరవతో ఈ మార్పు వచ్చింది. సంస్కృతం ఏ ఒక్క మతానికి పరిమితం కాదు. అది మన ప్రాంతానికి చెందిన సాంస్కృతిక స్మారకం. ఇది మాకూ చెందినదే అని డా. రషీద్ నొక్కి చెప్పారు. ఈ కోర్సు విజయవంతం కావడంతో.. యూనివర్శిటీ త్వరలో భగవద్గీత, మహాభారతం వంటి హిందూ పురాణాలపై కోర్సులను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది.