పాకిస్తాన్లోబస్సు లోయలో పడి 40 మంది మృతి..క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తుండగా ప్రమాదం..
ఇస్లామాబాద్: నైరుతి పాకిస్తాన్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైవేపై కంట్రోల్ తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది.