పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ అందించిన వైద్యులు.. మాట నిలబెట్టుకున్న నారా లోకేష్

అరుదైన స్పైనల్‌ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలు చిన్నారి పునర్వికకు కావాల్సిన ఇంజెక్షన్ అందింది. పునర్విక ప్రాణం నిలబెట్టేందుకు కావాల్సిన రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను డాక్టర్లు చిన్నారికి ఇచ్చారు. చిన్నారి పునర్విక చికిత్సకు కావాల్సిన జోల్‌ జెన్‌ స్మా ఇంజెక్షన్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ విదేశాల నుంచి తెప్పించారు. నారా లోకేష్ సమక్షంలోనే హైదరాబాద్‌రెయిన్‌బో ఆసుపత్రిలో పునర్వికకు డాక్టర్లు ఈ ఇంజెక్షన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, డాక్టర్లతో పాటుగా చిన్నారికి అండగా నిలిచిన ప్రజలకు పునర్విక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.