"ఫోరెన్సిక్ రిపోర్టునే ఫోర్జరీ చేశారు.. సీఎం భగవంత్ మాన్‌ను వెంటనే అరెస్ట్ చేయండి": బీజేపీ సంచలన డిమాండ్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చుట్టూ ఉన్న వివాదాలు సరికొత్త మలుపు తిరిగాయి. సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ అకాల్ తఖ్త్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో.. సీఎంను కాపాడేందుకు అధికార యంత్రాంగం ఏకంగా నకిలీ ఫోరెన్సిక్ రిపోర్టును సృష్టించిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. మద్యం వివాదానికి సంబంధించిన వీడియోలో ఉన్నది ముఖ్యమంత్రి కాదంటూ గత వారం విడుదల చేసిన క్లీన్ చిట్ నివేదిక.. అంతా ఒక ఫోర్జరీ డ్రామా అని గురుగ్రామ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.