బెంగళూరు టూ అమెరికా.. మధ్యలోనే 70 తులాల బంగారం చోరీ!

బెంగళూరు నుంచి అమెరికా వెళ్తున్న ఓ మహిళ లగేజీలో 790 గ్రాముల బంగారం, వజ్రాలు మాయమవ్వడం సంచలనంగా మారింది. మిడిల్ హాల్ట్ అబుదాబి చేరాక సూట్‌కేస్ తెరిచి చూస్తే నగలు లేవు కానీ, బ్యాగు మాత్రం పద్ధతిగా లాక్ చేసి ఉంది. అకాసా ఎయిర్‌లైన్స్‌ సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం సీసీటీవీల ఆధారంగా దొంగల వేట మొదలైంది. మూడు నెలల కిందట ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధిత కుటుంబం పోలీసులకు ఆశ్రయించింది. నవంబర్ 15, 2025న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు ప్రయాణించారు. మధ్యలో అబుదాబిలో ఆమెకు ట్రాన్సిట్ హాల్ట్ ఉంది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ స్కానింగ్, ట్యాగింగ్ అన్నీ సజావుగానే జరిగాయి. చెక్-ఇన్ కౌంటర్‌లో అన్ని పత్రాలను ధృవీకరించిన తర్వాత వారు తమ లగేజీని అప్పగించారు.