ముక్కులో వేయాల్సిన డ్రాప్స్ కళ్లలో వేశారు? చూపు కోల్పోయిన 19 నెలల చిన్నారి!

జలుబు, కళ్లు ఎర్రబడటంతో 19 నెలల చిన్నారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చాడు తండ్రి. అయితే, పరీక్షలు చేసిన వైద్యుడు ముక్కులో వేసే సెలైన్ నాసల్ డ్రాప్స్‌ను కళ్లలో వేశాడు. కొద్దిసేపటి తర్వాత చిన్నారి తీవ్ర ఇబ్బందికి గురవడంతో కాసేపు వైద్యం చేసిన వైద్యులు ఎయిమ్స్‌కి తీసుకెళ్లమన్నారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారికి పూర్తిగా కంటిచూపు పోయిందని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది.