మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. డిసెంబర్ 31కి కుమ్ముడే కుమ్ముడు.. అర్ధరాత్రి వరకు వైన్స్..

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల కోసం ప్రభుత్వం మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు.. బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు ఒంటి గంట (1 AM) వరకు అనుమతినిచ్చారు. వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్, పోలీస్ శాఖలు హెచ్చరించాయి. డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డాగ్ స్క్వాడ్స్, అత్యాధునిక టెస్టింగ్ కిట్‌లను సిద్ధం చేశారు. నగరం అంతటా భారీగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని, వాహనదారులు ముందుగానే డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.