రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తా... పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్

రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర శాసన సభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎన్ ఈశ్వర రావు పాల్గొన్నారు. లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని పులపర్తి రామాంజనేయులు,బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్ ,దేవ వరప్రసాద్,కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాగిత కృష్ణ ప్రసాద్, నక్కా ఆనంద బాబు, ఎన్ ఈశ్వర రావు ప్రతిపాదించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, ఎంపీలువి బాలశౌరి, టి ఉదయ్ శ్రీనివాస్, శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు,గిడ్డి సత్యనారాయణ తదితరులు లింగమనేని రమేశ్‌కు అభినందనలు తెలిపారు. అంతకు ముందు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతుల మీదుగా లింగమనేని రమేశ్ బీఫామ్ అందుకున్నారు. నామినేషన్ వేస్తున్న సందర్భంగా లింగమనేని రమేశ్‌కు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు., News News, Times Now Telugu