జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలతో గోదావరి పుష్కరాలకు మరింత శోభ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

‘గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించాలన్నది కూటమి ప్రభుత్వ తపన. ఇందుకు అనుగుణంగా గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతాం. పంచాయతీల నుంచి వచ్చే మురుగు నీరు చుక్క కూడా గోదావరిలోకి కలవడకుండా చర్యలు తీసుకోవాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలుగా తీర్చేదిద్దే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. ఇందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలి’అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై శనివారం గోదావరి పుష్కరాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లతో, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.‘గోదావరి పుష్కర ఘాట్లు, పుష్కర నగర్ ల వద్ద ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం. ముఖ్యంగా కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ అనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇందుకు అనుగుణంగా పని చేయండి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు., News News, Times Now Telugu