‘సాండ్’ బిజినెస్ పేరుతో రూ. 3 కోట్లు మోసం
ఇసుక వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయంటూ పలువురిని నమ్మించిన అన్నదమ్ములు రూ. 3 కోట్లు వసూలు చేసి కనిపించకుండా పోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో వెలుగుచూసింది.