ద్విచక్ర వాహనాల్లో రక్షణ కవచంలా హెల్మెట్ పెట్టుకున్నారు. లక్కీడి్‌పలో బహుమతి పొందారు. ఇలా వారం, నెలకు సంబంధించి ఏడు విభాగాల్లో ఎంపికైన 84 మందికి మంగళవారం చిత్తూరులో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘సురక్షిత చిత్తూరు- మీ భద్రత, మా బాధ్యత’ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడారు. ‘ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే. జరిమానాల భయంతో కాకుండా తమ కుటుంబ సభ్యుల భద్రత, ప్రాణాల విలువలను గుర్తించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించిన వారిని ప్రోత్సహించేలా హెల్మెట్ పెట్టు.. బహుమతులు పట్టు కార్యక్రమాన్ని చేపట్టాం’ అని ఎస్పీ వివరించారు.