ఆర్ఎస్ఎస్‌‌‌కు ప్రశంసలపై తీవ్ర చర్చ.. క్లారిటీ ఇచ్చిన డిగ్గీ రాజా

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను బయటపెట్టిందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలను తాను వ్యతిరేకిస్తానని, అయితే సంస్థాగత బలం నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాలని ఆయన వివరణ ఇచ్చారు. బట్టతల ఉన్నా ఇంటింటికీ వెళ్లి దువ్వెన అమ్మగల ఆర్ఎస్ఎస్ సామర్థ్యాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు, గాంధీ హంతకుల నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదని తేల్చిచెప్పారు.