ఆసుపత్రి దాకా ప్రాణం ఆగలేదని రోడ్డుపైనే సర్జరీ.. వైద్యుల సాహసానికి నెటిజన్ల సెల్యూట్

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి చూసిన ఇద్దరు వైద్య దంపతులు.. అతడిని ఎలాగైనా కాపాడాలనుకున్నారు. వెంటనే దగ్గరకు వెళ్లి చూడగా.. అతడు ఆస్పత్రికి వెళ్లే వరకు బతకడం కష్టం అని భావించి రోడ్డు మీదే ఆపరేషన్ చేయాలనుకున్నారు. స్థానిక ప్రజల సాయంతో ఫోన్ లైట్ల వెలుతూరులోనే శస్త్ర చికిత్స చేశారు. ఎలాగోలా కష్టపడి బాధితుడిని మృత్యుఒడి నుంచి ప్రాణాలతో బయటకు లాక్కొచ్చారు. ఆపై వెంటనే అతడిని మెరుగైన చికిత్స కోసం దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.