హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. గన్ తో కాల్చుకుని ఘాతుకం..!

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. హయత్‌నగర్ పరిధిలోని తన నివాసంలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై కృష్ణ చైతన్యను అత్యవసరంగా కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.