నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం: నాస్కార్ రేసింగ్ దిగ్గజం గ్రెగ్ బిఫిల్ కుటుంబం దుర్మరణం...ఏడుగురు మృతి

నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో మాజీ నాస్కార్ రేసింగ్ డ్రైవర్, రిటైర్డ్ దిగ్గజం గ్రెగ్ బిఫిల్ దుర్మరణం చెందారు. బిఫిల్‌తోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఏడుగురు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం నార్త్ కరోలినాలోని స్టేట్స్‌విల్ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఉదయం 10:15 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది.వివరాల్లోకి వెళ్తే ఫ్లోరిడాకు బయలుదేరిన సెస్నా సి550 బిజినెస్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు రావడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ల్యాండింగ్ అవుతుండగా విమానం కుప్పకూలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గ్రెగ్ బిఫిల్, ఆయన భార్య క్రిస్టినా, వారి కుమారుడు రైడర్, కుమార్తె ఎమ్మా మరణించినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది.అయితే మంటలధాటికి మృతదేహాలు ముద్దముద్ద అయినట్లు తెలుస్తోంది. దీంతో మృతదేహాల గుర్తింపు అధికారికంగా ఆలస్యం అవుతుందని అధికారులు నిర్ధారించారు., News News, Times Now Telugu