ఇది మీ ఇండియా కాదు.. న్యూజిలాండ్‌లో సిక్కుల ర్యాలీని అడ్డుకున్న రైట్ వింగ్

న్యూజిలాండ్‌లో సిక్కుల మతపరమైన ర్యాలీని కొందరు రైట్ వింగ్ వ్యక్తులు అడ్డుకోవడం కలకలం రేపింది. సాంప్రదాయ హకా ప్రదర్శిస్తూ, ఒక నిజమైన దేవుడు యేసు అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై న్యూజిలాండ్ రాజకీయ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. భారత్‌లోని పంజాబ్ సీఎం, పలువురు నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. సిక్కుల సంప్రదాయాలను ద్వేషపూరితంగా చూడటం ఖండించదగినదని సిక్కు గురుద్వార ప్రబంధక్ కమిటీ వ్యాఖ్యానించింది. ఈ ఘటన వీడియోలు వైరల్ అవుతున్నాయి.