ఏపీలోని ఆక్వా రైతులకు డబుల్ ధమాకా: ఆక్వా ఫీడ్ ధర తగ్గింపు... ఆక్వాసాగుకు యూనిట్ విద్యుత్ ధర రూ.1.50 పైసలే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆక్వాఫీడ్ ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడు చొరవచూపారు. ఆక్వాఫీడ్ తయారీదారులతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు ఉన్నతాధికారులు, ఆక్వారా రైతులు, ఫీడ్ తయారీదారులు పాల్గొన్నారు. ఆక్వా ఫీడ్ ధరలు, ఆక్వా సాగుకు విద్యుత్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆక్వా ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గించేందుకు తయారీ దారులు అంగీకరించారు.కేజీకి ప్రస్తుతమున్న రూ.112 నుంచి రూ.108కి ఫీడ్ ధరలను తగ్గించనున్నట్లు తయారీదారులు సీఎంకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో చేపలు, రొయ్యల సాగు రైతులు సంతోషం వ్యక్తం చేశారు., News News, Times Now Telugu