ఏయూకి పూర్వవైభవం తీసుకొస్తాం...ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేశ్

ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకువస్తామని, శతాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో విశాఖలో మంత్రి సమీక్షించారు. ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.‘యూనివర్సిటీని ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా తీర్చిదిద్దేందుకు శతాబ్ది ఉత్సవాలు వేదిక కావాలి. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు పూర్వ విద్యార్థులతో మమేకం కావడంతో పాటు శతాబ్ది ఉత్సవాల్లో వారిని భాగస్వాములను చేయాలి’అని ఐటీ, విద్య,ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు., News News, Times Now Telugu