"ఐదేళ్లు సహజీవనం చేసి ఆపై అత్యాచారం అంటే కుదరదు": అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

సుదీర్ఘకాలం పాటు పరస్పర అంగీకారంతో సాగిన రిలేషన్‌షిప్‌ విఫలమైతే.. ఆ తర్వాత దానిని అత్యాచారంగా మార్చలేమని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఐదేళ్లపాటు సహజీవనం చేసి, చివరికి పెళ్లి నిరాకరించాడనే కారణంతో ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది. ప్రారంభం నుంచే మోసం చేసే దురుద్దేశం ఉంటే తప్ప, కేవలం పెళ్లి మాట నిలబెట్టుకోలేదనే కారణంతో పాత బంధాన్ని క్రిమినల్ నేరంగా మార్చడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది.