చలి కాచుకుంటున్న వారిపైకి దూసుకెళ్లిన బీజేపీ నేత వాహనం.. ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్‌లో అధికార మదంతో ఒక బీజేపీ నేత సృష్టించిన బీభత్సం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కఠినమైన చలి నుంచి ఉపశమనం పొందేందుకు రోడ్డు పక్కన మంట వేసుకున్న అభాగ్యులపైకి మృత్యువులా దూసుకొచ్చింది ఒక కారు. మద్యం మత్తులో ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ యువజన విభాగం నేత దీపేంద్ర భదౌరియా.. తన వాహనంతో బీభత్సం సృష్టించి ఒక పదేళ్ల బాలుడిని, 65 ఏళ్ల వృద్ధుడిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘోర ప్రమాదం మోరెనా జిల్లాలో పెను విషాదాన్ని నింపడమే కాకుండా, తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.