తెలంగాణకు చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో చెల్లాచెదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ 23 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి.. రాబోయే 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురిపిస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20 శాతం వర్షపాత లోటు ఉండటంతో పాటు ఎండలు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాతే విత్తనాలు వేయాలని, ముందే వేస్తే పంటలు దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు.