తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెడతారా.. ఆ అధికారం మీకెవరిచ్చారు?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ లేఖ

తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కర్ణాటక నుంచి ఎన్‌వోసీ తెచ్చుకునే సాకుతో.. తెలంగాణ జల హక్కులను సీఎం తాకట్టు పెట్టారని ఆరోపించారు. కర్ణాటక నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్, బ్యారేజీల వల్ల రాజోలిబండ, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యమై పాలమూరు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.