నన్ను తక్కువగా చూడొద్దు...గ్లోరిఫికేషన్ సరికాదు: అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్

హీరోయిన్ల వేషధారణపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అనసూయ స్పందించిన సంగతి తెలిసిందే. నటుడు శివాజీకి అటు సోషల్ మీడియా ఇటు ప్రెస్మీట్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే కొంతమంది నెటిజన్లు అనసూయపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీరిలో మహిళలు సైతం ఉన్నారు. మరోవైపు శివాజీ సైతం అనసూయ వ్యాఖ్యలపై స్పందించారు. అనసూయను తానేమీ అనలేదని ఆమె ఎందుకు మధ్యలోకి వచ్చారు అని ప్రశ్నించారు. అనసూయ తన ఇన్ సెక్యూరిటీ గురించి మాట్లాడారని...అలాగే తనపై జాలి చూపించారని అన్నారు. త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం తనకు రావాలని కోరుకుంటున్నట్లు శివాజీ తెలిపారు. ఈ క్రమంలో అనసూయపై ట్రోలింగ్ పెరిగింది. ఈట్రోలింగ్‌పై అనసూయ స్పందించారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నా వయసును ఉపయోగించి తనను తక్కువగా చూపించడానికి...తనను చిన్నగా భావింపజేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. ఇందులో కొంతమంది పురుషులు ఉండగా...మరికొందరు మహిళలు సైతం ఉన్నారని అనసూయ తెలిపింది., News News, Times Now Telugu