కువైట్ వెళ్లే వారికి షాక్.. ఎంట్రీ, విజిట్ వీసాలపై నెలవారీ రుసుము ఖరారు.. పూర్తి వివరాలిదుగో!

గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్.. ప్రవాసుల నివాస, వీసా నిబంధనలను సమూలంగా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 23 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఎగ్జిక్యూటివ్ నిబంధనల ప్రకారం.. ఇకపై కువైట్‌లోకి ఎంట్రీ లేదా విజిట్ వీసాలపై వచ్చే వారు ప్రతి నెలా 10 కువైటీ దినార్ల రుసుమును విధిగా చెల్లించాలి. కేవలం వీసా ఫీజులే కాకుండా జనన ధృవీకరణ పత్రాల నమోదులో జాప్యం జరిగినా, గృహ కార్మికులు నాలుగు నెలల కన్నా ఎక్కువ కాలం దేశం వెలుపల ఉన్నా భారీ జరిమానాలు, రెసిడెన్సీ రద్దు వంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.