బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత: ప్రతిపక్ష నేత మృతితో అల్లకల్లోలం.. భారత హైకమిషన్ ముట్టడి

బంగ్లాదేశ్‌లో రాజకీయ అగ్నిపర్వతం మరోసారి బద్ధలైంది. హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత భారత్ వ్యతిరేక గళం వినిపించిన ఇంక్విలాబ్‌ మంచ్‌ కన్వీనర్‌ షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది మరణవార్త ఆ దేశాన్ని అల్లకల్లోలంలోకి నెట్టింది. గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో గాయపడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడవడం.. కుట్ర కోణాలకు తావివ్వడంతో నిరసనకారులు హింసకు దిగారు. చత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయాన్ని అర్ధరాత్రి వేళ ఆందోళనకారులు ముట్టడించి భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.