బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 10 లేదా అంతకంటే ముందే తెలంగాణను తాకనున్నాయి. ప్రస్తుతం ఇవి అనుకూల వాతావరణ పరిస్థితుల మధ్య వేగంగా ముందుకు సాగుతున్నాయి. రుతుపవనాల రాకకు ముందే ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, స్థానిక పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారాయని అంటున్నారు.