బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ఆ రూట్‌లో ఆగస్టు 15 నుంచే ప్రారంభం: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

గాల్లో తేలినట్లుండే ప్రయాణం.. చిటికెలో గమ్యాన్ని చేర్చే వేగం.. భారత రైల్వే కలల ప్రాజెక్టు బుల్లెట్ రైలు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. 2027 ఆగస్టు 15వ తేదీన భారతదేశం తన 81వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ బుల్లెట్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జపాన్ సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా.. గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా మధ్య తొలి రైలు పరుగులు తీయనుంది. గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు అందుబాటులోకి వస్తే.. అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య గంటల ప్రయాణం కేవలం 2 గంటల లోపునకే పరిమితం కానుంది.