భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇకపై కెనడా బయట జన్మించినా పౌరసత్వం ఖాయం

కెనడా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న ప్రవాసులకు జస్టన్ ట్రూడో ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశాబ్దాలుగా అడ్డంకిగా మారిన మొదటి తరం పరిమితి నిబంధనను సవరిస్తూ.. కెనడా బయట జన్మించిన కెనడియన్ల పిల్లలకు కూడా పౌరసత్వం కల్పించే చారిత్రక సంస్కరణను సోమవారం నుంచి అమలులోకి తెచ్చింది. బిల్‌ సీ-71 ద్వారా చేపట్టిన ఈ మార్పుల ప్రకారం.. తల్లిదండ్రులు కెనడాలో కనీసం మూడేళ్ల పాటు నివసించినట్లు నిరూపిస్తే, వారి పిల్లలు ప్రపంచంలో ఎక్కడ జన్మించినా కెనడా పౌరసత్వానికి అర్హులవుతారు. 2009 నాటి పాత నిబంధనల వల్ల పౌరసత్వం కోల్పోయిన వేలాది మంది భారతీయ సంతతి కుటుంబాలకు ఈ నిర్ణయం ప్రాణవాయువులా మారింది.