భారత్లో పెరుగుతున్న విడాకులు.. భరణం చెల్లించేందుకు భర్తల అప్పులు, ఆదాయంలో 38 శాతం ఖర్చు

భారత్లో విడాకుల ట్రెండ్ భారీగా పెరుగుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. ఇక విడాకులు తీసుకున్న తర్వాత పురుషులు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభంపై ఈ సర్వే సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఇక విడాకుల ఖర్చులు, విడాకుల తర్వాత భరణం చెల్లింపుల కోసం 42 శాతం మంది పురుషులు అప్పులు చేస్తున్నారని వెల్లడైంది. అదే సమయంలో పురుషులు సంపాదించే సంపాదనలో ఏటా 38 శాతం సొమ్మును.. విడాకుల తర్వాత మెయింటెనెన్స్ కింద చెల్లిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం.. విడాకుల ఆర్థిక భారం పురుషులపైనే పడుతోందని వెల్లడించింది.