"మన్మోహన్ సింగ్‌ ఆత్మహత్య చేసుకుంటానన్నారు, ఆయన్ను శాంతింపజేయడానికి 20 నిమిషాలు పట్టింది": ఖురేషి

కేంద్ర మంత్రులు ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తే తానే ఆత్మహత్య చేసుకుంటానంటూ అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) ఎస్‌వై ఖురేషి సంచలన విషయాలు వెల్లడించారు. 2012 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల వేళ ఈసీ నిర్ణయాలపై కొందరు కేబినెట్‌ మంత్రులు విమర్శలు గుప్పించగా.. ఈ విషయాన్ని తానే స్వయంగా అప్పటి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ స్పందించిన తీరు, మాట్లాడిన మాటలు విని తాను ఒక్కసారిగా నిశ్చేష్టుడినయ్యానని వివరించారు.