అన్నిరంగాలలో కృత్రిమమేథ చొరబడి కొత్తపుంతలు తొక్కుతోంది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రవాణా, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో కీలక భూమిక పోషిస్తోంది. అధునాతన సాంకేతికతని ఎంత అందిపుచ్చుకున్నా మనిషి మేధస్సు (బ్రెయిన్)ను వాడుతూ అవసరమైన చోట ఏఐ టూల్స్ వినియోగించినప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయంటున్నారు ఆ రంగానికి చెందిన నిపుణులు. తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో రెండో రోజైన శనివారం వివిధ రంగాల నిపుణులు మన భారతీయ విజ్ఞాన వైభవాన్ని వివరించారు. ఇక, వికసిత భారత్‌కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్(ఏఐ-ఎంఎల్) అప్లికేషన్స్‌పై చర్చ జరిగింది. తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ కాళిదాసు కోఆర్డినేటర్‌గా, ప్యానలిస్టులుగా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లు ఎం.విద్యాసాగర్, డాక్టర్ మోహన్‌రాఘవన్ నేరుగా హాజరవగా, పర్డ్యూ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అలోక్ ఆర్.చతుర్వేది, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ ఆర్నబ్ భట్టాచార్య వర్చువల్‌గా పాల్గొన్నారు. కృత్రిమమేథ మనిషి మేథస్సును అనుకరించేలా పనిచేసే కంప్యూటర్ వ్యవస్థ అని.. డేటా, అల్గోరిథమ్స్, మెషీన్ లెర్నింగ్‌పై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సరైన డేటా, నైతిక ప్రమాణాలు తప్పనిసరి అవసరమన్నారు. సబ్జెక్టుల పరంగా ఎంతపరిజ్ఞానాన్ని సాధించారనే దానికి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ద్వారా గతంలో తెలియగా, ఇప్పుడు అకడమిక్స్‌లో నేరుగా ఏఐ మూల్యాంకనాన్ని చేస్తున్నట్లు వివరించారు. చాట్ జీపీటీని రీసెర్చ్ పేపర్స్, లీడ్ జర్నల్స్‌లోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఏఐ ఫెయిలైతే పరిస్థితి ఏంటన్న పలువురి సందేహాలను వారు నివృత్తి చేశారు. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ నైతిక సమస్యలు పెరుగుతున్నాయని, బయాస్, ప్రైవసీ, సెక్యూరిటీ, ఉద్యోగాల ప్రభావం వంటివి ఉన్నాయంటున్నారు.