జిల్లా పునర్విభజన ప్రక్రియలో మళ్లీ మార్పుచేర్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ అవుతుందన్న ప్రచారం నేపధ్యంలో తాజాగా ప్రభుత్వం మరోసారి మార్పుచేర్పులపై తుది కసరత్తు చేపట్టింది. గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దానికి ప్రతిగా అన్నమయ్య జిల్లా నుంచీ రైల్వే కోడూరును తిరుపతిలో చేర్చే అవకాశమున్నట్టు తెలిసింది. గూడూరు నుంచి తిరుపతికి 97 కిలోమీటర్లు. అదే నెల్లూరు కేవలం 43 కిలోమీటర్లే. భౌగోళిక సామీప్యతతో పాటు గూడూరు ప్రాంత ప్రజలకు నెల్లూరుతో అనుబంధం ఉంది. దానికి తోడు ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేశ్ అక్కడి ప్రజలకు స్పష్టమైన హామీలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశాక 20 రోజులుగా గూడూరు నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, గూడూరును కోల్పోతున్న క్రమంలో దానికి ప్రతిగా అన్నమయ్య జిల్లా నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. రైల్వే కోడూరు నుంచీ ప్రస్తుత జిల్లా కేంద్రం రాయచోటికి 93 కిలోమీటర్లు. అదే తిరుపతి 52 కిలోమీటర్లే. అక్కడి ప్రజలూ తమ ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని కోరుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ రెండింటిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.