సామాన్య భక్తులకు పెద్ద పీట

జనవరి 1ని పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసే వారిలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఎస్పీ తుషారడూడి, చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ అన్నారు. శనివారం ఆలయ సమావేశ మందిరంలో జనవరి 1పై అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని అంచనా వేశారు. స్వామి దర్శనాన్ని అభిషేకం, అలంకరణ పూర్తయిన అనంతరం నాలుగు గంటలకు కల్పిస్తామన్నారు. ప్రముఖలకు త్వరితగతిన స్వామి దర్శనం కల్పిస్తామన్నారు. దివ్యాంగులకు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రద్దీకి అనుగుణంగా అన్న ప్రసాదాన్ని అందిస్తామన్నారు. ఆలయంలో 30, 31, 1వ తేదీల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు వారు తెలిపారు. ప్రతి భక్తుడికి స్వామి దర్శనం కల్పించి సంతోషంగా ఇళ్లకు చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని వారు చెప్పారు. విద్యుత్‌, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసులను ఏర్పాటు చేస్తామని పోలీసు శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్‌, డీఎస్పీ సాయినాథ్‌, ఏఈవోలు రవీంద్రబాబు, ధనపాల్‌, ప్రసాద్‌, ధనంజయ, ఆలయ బోర్డు సభ్యులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.