విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాద భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నెల 8న జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే, తాజాగా ఎస్‌ఎమ్‌ఎస్-1 యూనిట్‌లో ల్యాడిల్ నుంచి ఫైర్‌బాల్ ఎగసిపడటంతో కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, వరుసగా చోటుచేసుకుంటున్న స్వల్ప ప్రమాదాలు కార్మికుల్లో ఆందోళన పెంచుతున్నాయి. నాసిరకం ముడి పదార్థాలు, నాణ్యత నియంత్రణ లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తూ, భద్రతా ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.