సింగపూర్ టెక్ రంగ అవసరాలు తీర్చేందుకు ఏపీ యువత సిద్ధం...పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్రబాబు నాయుడు

‘ఇప్పుడు భారత్ నిద్రపోతున్న ప్రాంతం కాదు.. సంస్కరణలతో దూసుకుపోతున్న అతి పెద్ద ఆర్ధికశక్తి. ప్రధాని మోడీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి దేశాన్ని ఓ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారు’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘చైనా లాంటి దేశాలు ఆర్ధిక అభివృద్ది సాధించటానికి దశాబ్దాల కాలం పట్టింది. కానీ భారత్‌కు అంత సమయం పట్టటం లేదు. మెడికల్ టెక్నాలజీ సహా ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉంది’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.ఈ సమావేశానికి హాజరైన సింగపూర్‌‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి.నారాయణ, సింగపూర్‌ స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులు పాల్గొన్నారు. భారతదేశంలో సింగపూర్‌కు ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను శిల్పక్ అంబులే వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం చంద్బరాబు నాయుడు ఆకాంక్షించారు., News News, Times Now Telugu