సోనమ్‌ వాంగ్చుక్‌కు పాకిస్తాన్‌తో లింకులు.. లడఖ్ హింస వెనుక కారణాలపై డీజీపీ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర హోదా కావాలని లడ‌ఖ్‌లో జరిగిన ఆందోళనలు తీవ్ర హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. దాదాపు 5, 6 వేల మంది నిరసనకారులు ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది రంగంలోకి దిగడంతో హింస చెలరేగింది. ఈ నిరసనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 100 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్‌ దీక్ష వల్లే హింస చెలరేగిందని ఆరోపించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్చుక్‌కు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలపైనా దర్యాప్తు చేస్తున్నట్లు లడఖ్ డీజీపీ సంచలన ప్రకటన చేశారు.