హైదరాబాద్ ఐటీ కారిడార్ ముంపుకు కారణం ఇదే :హైడ్రా చీఫ్ రంగనాథ్
నగరంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరద ముంచెత్తిన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ గురువారం పర్యటించారు. మాదాపూర్, కొండాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో పర్యటించి కారణాలను పరిశీలించారు.