82 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం: సీఎం రేవంత్

2036 ఒలింపిక్ ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ, హైదరాబాద్ నగరం సర్వసన్నద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన గచ్చీబౌలి వేదికగా గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టారు. 82 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఈ ప్రపంచ స్థాయి వర్సిటీని 2028 డిసెంబరు నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన ఆరుగురు క్రీడాకారులకు రూ. 7.15 కోట్ల నగదు పురస్కారాలను అందజేశారు.