Bandar Apna Dost: కోతి “ఏఐ” వీడియోలు.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన ఛానెల్‌గా గుర్తింపు!

Bandar Apna Dost: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన యూట్యూబ్ ఛానల్ భారత్‌కు చెందినదేనని వెల్లడైంది. వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్ కాప్‌వింగ్ (Kapwing) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 100 యూట్యూబ్ ఛానళ్లను పరిశీలించగా, పూర్తిగా ఏఐ (AI) సృష్టించిన వీడియోలపైనే ఆధారపడే వందలాది ఛానళ్లను గుర్తించింది. భారతీయ యూట్యూబ్ ఛానల్ “బందర్ అప్నా దోస్త్” ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఛానల్‌లో వాస్తవికంగా కనిపించే ఒక కోతిని ప్రధాన పాత్రగా చూపిస్తూ.. మానవుల్లా భావోద్వేగాలు, హాస్యం, డ్రామా కలగలిసిన కథలను ఏఐ యానిమేషన్ రూపంలో చూపిస్తారు. చిన్నచిన్న మార్పులతో ఒకే తరహా కథలు వందల వీడియోలుగా విడుదలవుతుంటాయి.