చైనా మాంజా వల్ల ప్రాణహాని జరిగితే హత్య కేసులు
పతంగులు ఎగరవేయడానికి నిషేధిత చైనా మాంజా వాడి ఎవరికైనా ప్రాణహాని జరిగితే, సంబంధిత వ్యక్తులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.