మేల్కొని ఉన్నా.. దక్కని ప్రాణం

ఆయన కూర్చున్నది ఏసీ బోగీలో. రైలు ఎక్కినప్పటి నుంచి కొంతదూరం వరకు బోగీలో వాతావరణం చల్లగానే ఉంది. లోపల ఉన్న వాళ్లలో కొంతమంది చలికి దుప్పటి ముసుగేసుకుని నిద్రలోకి జారుకున్నారు. ఆయన మాత్రం ‘ఆర్థిక’ భద్రత కోసం కంటిరెప్ప వాల్చలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బోగీలో వెచ్చదనం మొదలైంది. ఆ వెచ్చదనమే మంటగా మారి మసి చేస్తుందని ఊహించలేదు. అగ్నికీలలు అల్లుకునే సరికి తేరుకున్నా జీవితం తెల్లారిపోయింది. మంటల్లోనే సజీవ దహనం అయిపోయాడు. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్‌ సుందరం(70) ఎదుర్కొన్న పరిస్థితి ఇది.